గీతా గోవిందం సినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజయింది. ఇప్పటికే ‘ఇంకేం కావాలే..’ అంటూ రిలీజైన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కి సోషల్ మీడియాలో అవుట్ స్టాండింగ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే అదే జోష్ లో ఈ రోజు ఈ సినిమా సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్.. ‘వాట్ ద F…’ అంటూ విజయ్ దేవరకొండ పాడిన ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సాంగ్ కి శ్రీమణి లిరిక్స్ రాశాడు.
విజయ్ దేవరకొండ ఏ చిన్న ఆక్టివిటీ చేసినా సోషల్ మీడియాలో వైరల్ ఎలిమెంట్ లా మారుతుంది. అలాంటిది విజయ్ దేవరకొండ పాడిన సాంగ్ అనగానే ఫ్యాన్స్ లో ఈ సాంగ్ రిలీజ్ కి ముందు నుండే వైబ్స్ క్రియేట్ అయి ఉన్నాయి. ఈ జెనెరేషన్ లో అమ్మాయిలను హ్యాండిల్ చేయడం చాలా కష్టమని కన్వే చేసే లిరిక్స్ తో, ఫ్రస్ట్రేటెడ్ యూత్ ఆంగిల్ లో విజయ్ దేవరకొండ పాడిన ఈ సాంగ్, ఇప్పుడు యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.
ఈ నెల 29 న గ్రాండ్ గా ఆడియో రిలీజ్ జరుపుకోనున్న ఈ సినిమా సాంగ్స్ పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. గోపీ సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు.