విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీస్

Wednesday,August 30,2017 - 07:03 by Z_CLU

అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరో. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో సూపర్ హ్యాప్పీ మూడ్ లో విజయ్, ఆచితూచి సినిమాలకు సంతకం చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం విజయ్ అకౌంట్ లో ఉన్న అప్ కమింగ్ మూవీస్ ఇవే…

అప్ కమింగ్ మూవీ 1 : గీతా ఆర్ట్స్, UV క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా మరో వారం రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది. రాహుల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్, డిసెంబర్ కల్లా థియేటర్స్ లోకి వచ్చే చాన్సెస్ ఉన్నాయి.

అప్ కమింగ్ మూవీ 2 : రీసెంట్ గా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మరో సినిమాతో సెట్స్ పైకి వచ్చేశాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఈ సినిమా వారం రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్న ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.

అప్ కమింగ్ మూవీ 3 : భరత్ కమ్మ డైరెక్షన్ లోను విజయ్ దేవరకొండ మరో సినిమా చేసే ప్రాసెస్ లో ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా మ్యాగ్జిమం డిసెంబర్ కల్లా స్టేజ్ పైకి వచ్చే చాన్సెస్ ఉన్నాయి.

ఈ సినిమాలతో పాటు విజయ్ ‘మహానటి’ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ లోపు మరో ఇద్దరు బడా డైరెక్టర్స్ తో ఆల్ రెడీ  స్టోరీ డిస్కషన్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ రేపో మాపో ఈ సినిమా డీటేల్స్ అనౌన్స్ చేసే చాన్సెస్ ఉన్నాయి.