నిర్మాతగా విజయ్ దేవరకొండ

Tuesday,October 02,2018 - 04:23 by Z_CLU

ఏం చేసినా డిఫెరెంట్ గా చేస్తాడు. సినిమాలైనా.. ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ అయినా. గీత గోవిందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ చెప్పినట్టు ట్రోల్స్ ని కూడా ఎంజాయ్ చేయగలిగే ఏకైక హీరో విజయ్ దేవరకొండ. అందుకే ఈ యంగ్ హీరోకి ఆ రేంజ్ లో క్రేజ్. అయితే ఈ క్రేజ్ మీటర్ ని పెంచుకోవడానికి మరో మెట్టెక్కనున్నాడు ఈ హీరో. ఇప్పటి వరకు హీరోగా ఎంటర్ టైన్ చేసిన విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్ గా కొత్త అవతారం ఎత్తనున్నాడు.

నిన్న జరిగిన ‘నోటా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్వరలో సినిమా నిర్మించనున్న విషయం రివీల్ చేసిన విజయ్ దేవరకొండ, ‘కింగ్  ఆఫ్  ది హిల్’  అనే  పేరుతో  ప్రొడక్షన్ హౌజ్ లోగో ను కూడా రిలీజ్ చేశాడు. ప్రొడ్యూసర్ గా తన మార్క్ సినిమాలను నిర్మిస్తానని చెప్పుకున్నాడు విజయ్ దేవరకొండ.

ప్రస్తుతం నోటా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ, ఈ సినిమాలో చీఫ్ మినిస్టర్ గా కనిపించనున్నాడు. ఆనంద్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ నెల 5 న గ్రాండ్ గా రిలీజవుతుంది ఈ సినిమా.