సరికొత్త మేకోవర్ లో విజయ్ దేవరకొండ

Thursday,November 09,2017 - 04:37 by Z_CLU

అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ కోసం కష్టపడుతున్నాడు. ఈ విషయాన్ని తానే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అర్జున్ రెడ్డి సినిమా తరవాత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయిన విజయ్ దేవరకొండ, ఇంతకీ ఏ సినిమా సిక్స్ ప్యాక్ చేయబోతున్నాడో అనే క్వశ్చన్ ఫ్యాన్స్ లో రేజ్ అయింది.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘మహానటి’ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. అర్జున్ రెడ్డి లాంటి మాసివ్ హిట్ తరవాత తన నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందోనని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఈ సిక్స్ ప్యాక్స్ అప్ డేట్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ లా మారింది.