'పెళ్లిచూపులు' హీరో తో లేడి డైరెక్టర్

Saturday,August 20,2016 - 10:00 by Z_CLU

 

‘ఎవడె సుబ్రహ్మణ్యం’ చిత్రం తో నటుడిగా పరిచయమైన విజయ దేవరకొండ తాజా గా నటించిన చిత్రం ‘పెళ్లి చూపులు’ ఈ సినిమా సాధించిన విజయం తో రాత్రికి రాత్రే కుర్ర స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు విజయ్. ప్రస్తుతం  వరుస ఆఫర్స్ అందుకుంటున్న ఈ యంగ్ హీరో త్వరలోనే నందిని రెడ్డి దర్శకత్వం లో ఓ సినిమా చేయనున్నాడట. ఇటీవలే ఈ లేడి డైరెక్టర్ చెప్పిన కథ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట విజయ్. ఈ సినిమాలో విజయ్ సరసన మాళవిక కథానాయిక గా నటించనుంది.
త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.