రేపు రిలీజవుతున్న టాక్సీవాలా టీజర్

Tuesday,April 17,2018 - 04:16 by Z_CLU

మే 18 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది విజయ్ దేవరకొండ టాక్సీ వాలా’. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ  సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసిన సినిమా యూనిట్, రేపు సాయంత్రం  6  గంటలకు  ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. రీసెంట్  గా     సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి మ్యాగ్జిమం అటెన్షన్ ని గ్రాబ్ చేసిన ఫిల్మ్ మేకర్స్, ఈ టీజర్ తో  సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో పనుల్లో బిజీగా ఉన్న ఫిల్మ్ మేకర్స్, త్వరలో ఆడియో  కూడా రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన మాళవిక నాయర్ తో పాటు ప్రియాంక జువాల్కర్ హీరోయిన్స్ గా నటించారు.

 

ఈ సినిమాకి జేక్స్ బిజాయ్ మ్యూజిక్ కంపోజర్. గీతా ఆర్ట్స్ తో పాటు UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా మే 18 న రిలీజవుతుంది.