విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా టీజర్ రిలీజ్ డేట్

Saturday,April 14,2018 - 03:51 by Z_CLU

విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ టీజర్ రిలీజ్ కి రెడీ అయింది. రీసెంట్ గా విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసిన ఫిలిమ్ మేకర్స్, ఈ నెల 17  న ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండను డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్.

 

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.  మాళవిక నాయర్ తో పాటు ప్రియాంక జవాల్కర్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్స్ గా కనిపించనున్నారు.

 

జేక్స్ బిజాయ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా ఆడియో ను త్వరలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిలిమ్  మేకర్స్. గీతా ఆర్ట్స్ తో పాటు UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా మే 18 న రిలీజవుతుంది.