విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ ఫస్ట్ గేర్ రిలీజయింది

Friday,March 23,2018 - 05:53 by Z_CLU

విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ ఫస్ట్ లుక్ రిలీజయింది. ఫస్ట్ గేర్ పేరిట రిలీజైన ఈ ఫస్ట్ లుక్ టీజర్ ని యూ ట్యూబ్ లో కూడా రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. 0: 27 సెకన్ల పాటు ఉన్న ఈ ఫస్ట్ గేర్ వీడియోలో విజయ్ దేవరకొండ నడిపే ట్యాక్సీ తో పాటు, హీరో ఆటిట్యూడ్ ఎలివేట్ అవుతుంది.

థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండను డిఫెరెంట్ యాంగిల్ లో ప్రెజెంట్ చేయనున్నాడు డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా, ఫాస్ట్ పేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్  హీరోయిన్ గా నటిస్తుంది. జేక్స్ బిజాయ్ మ్యూజిక్ కంపోజర్. గీతా ఆర్ట్స్ 2 తో పాటు UV క్రియేషన్స్ బ్యానర్ పై  తెరకెక్కుతున్న ఈ సినిమాను SKN నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 18 న రిలీజవుతుంది.