విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

Monday,March 19,2018 - 04:20 by Z_CLU

UV క్రియేషన్స్ బ్యానర్, గీతా ఆర్ట్స్-2 సంయుక్తంగా నిర్మిస్తున్న విజయ్ దేవరకొండ సినిమా ట్యాక్సీవాలా. థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ నెల 23 న రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న ఈ సినిమాని మే 18న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.

అర్జున్ రెడ్డిలో డిఫరెంట్ గా కనిపించిన విజయ్ దేవరకొండ, టాక్సీవాలాలో కూడా సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. 

ఈ సినిమాతో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా పరిచయం కానుంది. జాక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో జాషువా కంపోజ్ చేసిన స్టంట్స్ హైలెట్ అని టాక్.