‘టాక్సీవాలా’ చెప్పిన కారు కథ

Thursday,November 08,2018 - 12:02 by Z_CLU

నవంబర్ 17 న రిలీజవుతుంది విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్ ప్రాసెస్ లో భాగంగా,  విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేసిన ట్యాక్సీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు.

సినిమాలో విజయ్ దేవరకొండ తరవాత అంతగా ఎట్రాక్ట్ చేస్తున్న ఎలిమెంట్ ఈ వింటేజ్ కారు. ఇప్పుడున్న కార్లతో కంప్లేర్ చేస్తే రేర్ ఓల్డ్ మోడల్ అవ్వడంతో చూడగానే స్పెషల్ ఫీలింగ్ కలుగుతుంది. అయితే OLX లో కొన్న ఈ కారు వల్ల టాక్సీవాలా టీమ్ పడ్డ కష్టం మాత్రం అంతా ఇంతా కాదు.

ఏ మాత్రం కండిషన్ లో లేని ఈ కారు, చాలా సిచ్యువేషన్స్ లో ఇబ్బంది పెట్టేసిందట. కారులో A/C లేకపోవడమే పెద్ద కష్టం అనుకుంటే, అంత స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ ఓల్డ్ మోడల్ కారులో ఒకే డోర్ పని చేస్తుందట. ఇక ఎవరు కారు ఎక్కాల్సి వచ్చినా ఆ ఒక్క డోర్ ద్వారా లోపలికి వెళ్ళాల్సిందే. అందుకే  ఈ కారు పెడుతున్న కష్టాలు తట్టుకోలేక సేఫ్ సైడ్ గా ఇంకో కారు బ్యాకప్ కి కూడా పెట్టుకున్నారట మేకర్స్.

ఒక మనిషి సబ్ కాన్షియస్ మైండ్ కి, టాక్సీ కి మధ్య ఉండే సంబంధమే ‘టాక్సీవాలా’ సినిమాలోని హై పాయింట్. ఈ సినిమా రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్షన్ లో తెరకెక్కింది. జేక్స్ బిజాయ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. గీతా ఆర్ట్స్ 2, UV పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాని SKN నిర్మించాడు.