హీరోయిన్ ను రిపీట్ చేస్తున్న విజయ్ దేవరకొండ

Thursday,February 08,2018 - 12:55 by Z_CLU

ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న విజయ్ దేవరకొండ సినిమా ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా సెట్స్ పైకి రానున్న విజయ్ నెక్స్ట్ సినిమాలోను హీరోయిన్ చాన్స్ కొట్టేసింది రష్మిక.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో భరత్ కమ్మ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ కానున్నాడు. అయితే ఈ సినిమాలో విజయ్ ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడే కాలేజ్ స్టూడెంట్ లా కనిపించనున్నాడు.

ఛలో సినిమాతో యూత్ లో ఇంట్రెస్టింగ్ క్రేజ్ ని క్రియేట్ చేసుకున్న రష్మిక బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో బిజీగా ఉంది. అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ హిట్ తరవాత వస్తున్న ఈ కాంబినేషన్ ఏ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.