విజయ్ దేవరకొండ ‘నోటా’ లో మరో హీరోయిన్

Friday,April 27,2018 - 02:24 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది విజయ్ దేవరకొండ ‘నోటా’. అల్టిమేట్ పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో, మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చెన్నై సంచన నటరాజన్ ని ఫిక్స్ చేసుకున్నారు ఫిల్మ్ మేకర్స్.

అల్టిమేట్ పొలిటికల్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమాతో కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు విజయ్ దేవరకొండ. థ్రిల్లింగ్ పొలిటికల్ ఎలిమెంట్స్ హైలెట్ కానున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ టఫ్ఫెస్ట్ పొలిటీషియన్ లా కనిపించనున్నాడు.

 

గతంలో విక్రమ్ హీరోగా నటించిన ‘ఇంకొక్కడు’ సినిమాకు దర్శకత్వం వహించిన ఆనంద్ ఈ  సినిమాకి డైరెక్టర్. శ్యామ్ C.S. మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని K. E. జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.