అక్టోబర్ 18 న విజయ్ దేవరకొండ కొత్త సినిమా

Saturday,October 13,2018 - 12:06 by Z_CLU

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కొత్త సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ నెల 18 న ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు ఫిలిమ్ మేకర్స్. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.

అర్జున్ రెడ్డి సినిమాలో మోస్ట్ అగ్రెసివ్ రోల్  లో నటించి ఫ్యాన్స్ కి దగ్గరైన విజయ్ దేవరకొండ, రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘గీత గోవిందం’ సినిమాలో సెన్సిబుల్ లవర్ బాయ్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు అదే రూట్ లో మరోసారి ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ తో ఎంటర్ టైన్ చేయడానికి విజయ్ దేవరకొండ.

ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన ఫిల్మ్ మేకర్స్ త్వరలో ఈ  సినిమా రెగ్యులర్ షూటింగ్ ని బిగిన్ చేసే ఆలోచనలో ఉన్నారు. రాశిఖన్నా తో పాటు ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లెడి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గోపీసుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. K.A. వల్లభ ప్రొడ్యూసర్.