విజయ దేవరకొండ సినిమా టైటిల్ ఫిక్సయింది

Thursday,March 08,2018 - 06:22 by Z_CLU

విజయ్ దేవరకొండ, మెహరీన్ కౌర్ జంటగా నటిస్తున్న సినిమా టైటిల్ ఫిక్సయింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘నోటా’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్, ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఎవరూ నచ్చని పరిస్థితుల్లో ఓటరు ఎంచుకునే ఆప్షన్ ‘NOTA’.  ఫిల్మ్  మేకర్స్  ఈ  టైటిల్ ని ఫిక్స్  చేసుకున్న దాన్ని బట్టి  ఈ సినిమా పక్కా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ తో ఎట్రాక్ట్ చేసిన విజయ్ దేవరకొండ ఈ సినిమాలో డిఫెరెంట్ ఆంగిల్ లో కనిపించనున్నాడు.

గతంలో విక్రమ్ హీరోగా నటించిన ‘ఇంకొక్కడు’ సినిమాకు దర్శకత్వం వహించిన ఆనంద్ ఈ  సినిమాకి డైరెక్టర్. శ్యామ్ C.S. మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని K. E. జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.