విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ

Tuesday,May 08,2018 - 06:41 by Z_CLU

మహానటి సినిమాలో విజయ్ ఆంటోని గా కనిపించనున్నాడు విజయ్ దేవరకొండ.  ఇంత గొప్ప సినిమాలో చిన్న రోల్ ప్లే చేయగలిగినందుకు చాలా హ్యాప్పీగా ఫీలవుతున్నానని చెప్పుకున్న విజయ్ దేవరకొండ, ఈ సినిమాలో తన రోల్ గురించి, దుల్కర్ ప్లే చేసిన జెమినీ గణేషన్ చుట్టూ జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

నా ఇమ్మీడియట్ రియాక్షన్ అదే…

నాగ్ అశ్విన్ నాకు ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కాబట్టి న్యాచురల్ గానే తనతో ఒక బాండింగ్ ఉంది. ఎప్పుడైతే  ‘మహానటి’ సినిమా గురించి నాగి చెప్పాడో, ఎలాగైనా ఆ సినిమాలో పార్ట్ అయి, ఆ సినిమాకి హెల్ప్ చేయాలని స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యా…

 

 

చాలా చిన్న రోల్…

మహానటి’ లో నాది చాలా చిన్న రోల్. సావిత్రి గారి స్టోరీని రీసర్చ్ చేసి చెప్పడానికి సపోర్ట్  చేసే క్యారెక్టర్. అయినా నేను ఈ సినిమాలో పార్ట్ అయినందుకు హ్యాప్పీగా ఫీలవుతున్నా. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు.

నా సినిమా కాదు…

‘మహానటి’ నా సినిమా కాదు. అర్జున్ రెడ్డి ని చూడటానికో, విజయ్ దేవరకొండను చూడటానికో ‘మహానటి’ సినిమా చూడాలనుకోవద్దు. ఇది సావిత్రి గారి సినిమా. ఈ సినిమాలో నేను జస్ట్ చిన్న సపోర్టింగ్ రోల్ చేశాను.

విజయ్ ఆంటోని…

సినిమాలో విజయ్ ఆంటోని అంటే సమంత ప్లే చేసిన మధురవాణి క్యారెక్టర్ కి సపోర్టింగ్ రోల్. సమంతా పర్ఫామెన్స్ చాలా బావుంటుంది సినిమాలో…

జెమినీ గణేషన్ కోసం నన్ను అప్రోచ్ అయ్యారు…

జెమినీ గనేషన్ క్యారెక్టర్ కోసం ఫస్ట్ దుల్కర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకె అని చెప్పినా, ఆ తరవాత షూటింగ్ డిలే అవ్వడంతో, ఆ తర్వాత డేట్స్ ని దుల్కర్ తొందరగా కన్ఫమ్ చేయలేకపోయాడు. అపుడు నాగి నాకు కాల్ చేశాడు. దుల్కర్ చేయకపోతే అది నేనే చేయాలి అని నాగి చెప్పాడు…

 

దుల్కర్ నన్ను సేవ్ చేశాడు…

నాగి జెమినీ గణేషన్ క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు ఒక్కసారిగా డైలమాలో పడ్డా… జెమినీ గనేషన్ క్యారెక్టర్ అంటే మినిమం 1 మంత్ ప్రిపరేషన్స్ ఉండాలి. నా దగ్గర అంత టైమ్ లేదు.. అలాగని నో అనే చెప్పే ధైర్యం లేదు…రేపు సినిమా రిలీజయ్యాక అయ్యో నో అని చెప్పానే అనే గిల్ట్ ఫీలింగ్ ఇమాజిన్ చేసుకుంటేనే బాలేదు.. అప్పుడు దుల్కర్ నన్ను సేవ్ చేశాడు…

నాగి కాల్ చేయడంతో రిలాక్స్ గా ఫీల్ అయ్యా…

ఒకరోజు నాగి నాకు కాల్ చేసి దుల్కర్, జెమినీ గణేషన్ రోల్ కి ఓకె చెప్పాడు. నువ్వు ఆంటోనిగా ఫిక్సయిపో అన్నాడు… ఇక రిలాక్స్ అయిపోయా…