మరో కొత్త దర్శకుడితో విజయ్ దేవరకొండ

Monday,November 06,2017 - 06:01 by Z_CLU

కొత్త దర్శకులతో సినిమాలు చేయడం విజయ్ దేవరకొండకు కొత్తేంకాదు. సూపర్ హిట్ అయిన పెళ్లిచూపులు, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమాలను డైరక్ట్ చేసింది కొత్త దర్శకులే. ఇప్పుడు మరోసారి అదే టైపు ప్రయోగానికి రెడీ అవుతున్నాడు ఈ స్టార్. భరత్ కమ్మ అనే దర్శకుడ్ని పరిచయం చేస్తూ ఓ సినిమా చేయడానికి గ్రౌండ్ రెడీ చేశాడు

సూపర్ హిట్ సినిమాలు నిర్మిస్తున్న మైత్రీమూవీ మేకర్స్ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించబోతోంది. మైత్రీ మూవీస్ తో పాటు.. విజయ్ దేవరకొండతో గతంలో పెళ్లిచూపులు సినిమాను నిర్మించిన “బిగ్ బెన్ సినిమాస్” బ్యానర్ కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది.

ప్రస్తుతం గీతాఆర్ట్స్-2 బ్యానర్ లో పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. రాహుల్ అనే దర్శకుడ్ని పరిచయం చేస్తూ మరో సినిమా కూడా సైమల్టేనియస్ గా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఒకటి కొలిక్కి వచ్చిన వెంటనే భరత్ కమ్మ మూవీ స్టార్ట్ అవుతుంది.