విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’ జ్యూక్ బాక్స్ రివ్యూ

Monday,July 30,2018 - 07:23 by Z_CLU

పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కిన విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’ సాంగ్స్ రిలీజయ్యాయి. ఆగష్టు 15 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా అప్పుడే ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

గోపీసుందర్ కంపోజ్ చేసిన ఈ సినిమా సాంగ్స్ అప్పుడే బ్లాక్ బస్టర్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమాలో సందర్భానుసారంగా ఉండబోయే 5 పాటలతో రిలీజైన ఈ సినిమా జ్యూక్ బాక్స్ రివ్యూ..

ఇంకేం ఇంకేం కావాలే : ఈ సినిమా రిలీజైన మొట్టమొదటి పాట. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట సాంగ్ రిలీజైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాలో ఏ సిచ్యువేషణ్ లో ఈ సాంగ్ ఉండబోతుందన్నది గెస్ చేయడం కష్టమే కానీ, ఈ సాంగ్ ఇంపాక్ట్ ‘గీతగోవిందం’ పై స్ట్రాంగ్ గా ఉండబోతుంది. ఈ సినిమాకి అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశాడు.

ఏంటి ఏంటి..: ‘అక్షరం చదవకుండా…’ అంటూ బిగిన్ అయ్యే లిరిక్స్ సినిమాలోని సిచ్యువేషన్ ని ఎలివేట్ చేస్తున్నాయి. హీరో గురించి అపార్థం చేసుకున్న హీరోయిన్, తను చేసిన తప్పును రియలైజ్ అయి, హీరోతో లవ్ లో పడే సిచ్యువేషన్ లో ఉండే సాంగ్ అని  తెలుస్తుంది. శ్రీమణి రాసిన ఈ సాంగ్ చిన్మయి పాడింది.

 

వచ్చిందమ్మా : పక్కా ఫ్యామిలీ సాంగ్. అలాగని ఫ్యామిలీలో అందరూ కలిసి పాడుకునే సాంగ్ కాకపోయినా, హీరోయిన్ ఇంట్లో అడుగు పెట్టిన వేళ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో సందర్భానుసారంగా ఉండబోయే సాంగ్. శ్రీమణి లిరిక్స్ రాసిన ఈ సాంగ్ ని సిద్ శ్రీరామ్ పాడాడు.

వాట్ ద లైఫ్ : సినిమాలో ఎక్స్ క్లూజివ్ యూత్ కోసమే కంపోజ్ చేశారా..? అన్నంతలా ఎట్రాక్ట్ చేస్తుందీ సాంగ్. ప్రస్తుతం యూత్ ఫేవరేట్ లిస్టులో ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసుకున్న ఈ సాంగ్ స్క్రీన్ పై ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ ప్రతి ఒకరిలో క్రియేట్ అయి ఉంది. శ్రీమణి లిరిక్స్ రాసిన ఈ సాంగ్ ని విజయ్ దేవరకొండ పాడాడు.

కనురెప్పల కాలం : గోపీసుందర్ పాడిన ఈ సాంగ్ సినిమాలోని ఇమోషనల్ ఆంగిల్ ని ఎలివేట్ చేస్తుంది. ఈ పాటకి సాగర్ నారాయణ లిరిక్స్ రాశాడు.