గీతా గోవిందం ఫస్ట్ సింగిల్ – సూపర్ హిట్

Tuesday,July 10,2018 - 03:31 by Z_CLU

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా నటిస్తున్న ‘గీతా గోవిందం’ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఇంప్రెస్ చేసిన ఫిల్మ్ మేకర్స్, ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్, సినిమాపై మరింత హైప్ ని క్రియేట్ చేస్తుంది.

‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే…’ అంటూ బిగిన్ అయ్యే ఈ సాంగ్,  యూత్ ని ఇంప్రెస్ చేస్తుంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ రాసిన ఈ సాంగ్ ని సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడాడు. జస్ట్ ఫస్ట్ సింగిల్ కే సోషల్ మీడియాలో  క్రియేట్ అవుతున్న ఇంపాక్ట్ చూస్తుంటే, ‘గీతాగోవిందం’  విజయ్ దేవరకొండ కరియర్ లో   మరో  బ్లాక్ బస్టర్ గా నిలిచిపోవడం గ్యారంటీ అనిపిస్తుంది.

4: 29 సెకన్ల పాటు ఉన్న  లిరికల్  వీడియోలో   ఎటాచ్ చేసిన స్టిల్స్, సినిమాపై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ ని రేజ్ చేస్తున్నాయి. ఇమోషనల్  లవ్ ఎంటర్ టైనర్  గా తెరకెక్కుతున్న  ఈ సినిమాలో  విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కెమిస్ట్రీ అదుర్స్ అనిపించుకోవడం గ్యారంటీ అనిపిస్తుంది.

  ఆగష్టు 15 న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. GA2 పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పరశురాం డైరెక్టర్.