‘మహానటి’ లో విజయ్ దేవరకొండ రోల్ రివీలయింది

Tuesday,April 10,2018 - 04:51 by Z_CLU

రీసెంట్ గా ‘మహానటి’ లో సమంతా ఫస్ట్ లుక్ ని రివీల్ చేసిన సినిమా యూనిట్, ఈ రోజు విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పేరు విజయ్ ఆంటోని. అంతే కాదు ఈ రోజు రిలీజైన ఈ పోస్టర్ ని విజయ్ ఈ సినిమాలో ఫోటో జర్నలిస్ట్ గా కనిపించనునట్టు తెలుస్తుంది.

1980 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంతాతో పాటు కీ రోల్ ప్లే చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు మాస్ క్యారెక్టర్స్ లో కనిపించిన విజయ్, ఈ రోజు రిలీజైన ఈ స్టిల్ లో ఇంప్రెస్ చేస్తున్నాడు. దానికి తోడు “నిజం ఎప్పుడూ అందంగానే ఉంటుంది మధురవాణి గారు” అని మెన్షన్ చేయడంతో, విజయ్ ఈ సినిమాలో సాఫ్ట్ క్యారెక్టర్ ప్లే చేసి ఉంటాడని గెస్ చేస్తున్నారు ఫ్యాన్స్.

 

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 9 రిలీజవుతుంది. ఈ సినిమాని స్వప్నదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మిక్కీ. జె. మేయర్ మ్యూజిక్ కంపోజర్.