'విజయ్ దేవర కొండ' ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Monday,February 27,2017 - 05:27 by Z_CLU

‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరో గా పరిచయం అయి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ త్వరలోనే ‘ద్వారక’ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చ్ 3 న రిలీజ్ కానున్న సందర్భంగా విజయ్ మీడియా తో ముచ్చటించాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే…..

 

ఆ సినిమా రాకపోతే

నిజానికి యాక్టర్ కాకపోతే రైటరో లేక డైరెక్టరో అయ్యే వాడినేమో. అప్పుడప్పుడు స్టోరీస్ రాస్తూ ఉండటం నాకు ఎప్పటినుంచో అలవాటు.. ఆ స్కిల్స్ తోనే ఒకవేళ యాక్టర్ కాకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోనో లేకపోతే రైటర్ గానో  ట్రై  చేద్దామనుకున్నా.. ఏదేమైనా 25 ఏళ్ల లోపు ఏదో ఒక డిపార్ట్మెంట్ లో సెటిల్ అవ్వాలని గట్టిగా డిసైడ్ అయిపోయా. కానీ ఇక యాక్టర్ అవ్వలేనేమో అనుకునే టైంలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో ఛాన్స్ వచ్చింది.ఆ టైంలో ఆ సినిమా రాకపోతే యాక్టర్ అయ్యే వాడిని కాదు..

 

పెళ్లి చూపులు కంటే ముందే

‘ద్వారక’ కథ ‘పెళ్లి చూపులు’ సినిమా కంటే ముందే విన్నా… పెళ్లి చూపులు సైన్ చేసి సెట్స్ కి వెళ్లే టైం లో ఈ స్క్రిప్ట్ వచ్చింది. వినగానే యాజిటీజ్ నచ్చింది.. ‘పెళ్లి చూపులు’ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ‘ద్వారక’ షూట్ కూడా పాటలు మినహా ఫినిష్ చేసేశాను.. సో రెండు సినిమాలు ఆల్మోస్ట్ ఒకే టైం లో చేశా..

 

ఆ వార్త వాస్తవమే

‘పెళ్లి చూపులు’ తరువాత రెమ్యూనరేషన్ పెంచాననే వార్త నిజమే. ఒక సక్సెస్ తర్వాత అది సహజమే కదా… కానీ ఎంత పెంచాననేది చెప్పను (నవ్వుతూ)…

 

ద్వారక దాని చుట్టూ తిరిగే కథ

‘ద్వారక’ ఎర్ర శీను అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ 150 ఫ్లాట్స్ ఉండే ఒక పెద్ద అపార్ట్మెంట్ లో జరిగే కథతో తెరకెక్కిన సినిమా.. ఒక సంఘటన వల్ల ఎర్ర శీను అనే దొంగ కృష్ణానంద స్వామి గా మారి ద్వారక అనే అపార్ట్మెంట్ లో ఎలా తిష్ట వేశాడు..? చివరికి ఎలా బయటపడ్డాడు అనే పాయింట్ తో మా డైరెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించారు.

ఆ అనుభవం ఉంది

ఈ సినిమా అంతా జరిగేది అపార్ట్మెంట్ లోనే. నేను ప్రెజెంట్ ఉంటుంది కూడా అపార్ట్మెంట్ లోనే. కాబట్టి అక్కడ జరిగే సీన్స్… వ్యక్తుల పై నాకు చాలా అవగాహన ఉంది. మొన్నటి వరకూ నేనెవరో మా అపార్ట్మెంట్ లో ఎవ్వరికి తెలియదు కానీ పెళ్లి చూపులు రిలీజ్ తర్వాత అందరు గుర్తుపట్టి కింద జరిగే ఫంక్షన్స్ కి కూడా ఇన్వైట్ చేస్తున్నారు…

రిలీజ్ లేట్ కి రీజన్ అదే

ఆక్చువల్ గా ‘ద్వారక’ నవంబర్ లో రిలీజ్ అవ్వాలి. కానీ మేము రిలీజ్ డేట్ అనౌన్స్ చేద్దామనుకుంటుండగా అప్పుడే నోట్ల రద్దు అనౌన్స్ మెంట్ వచ్చింది. సో ఆడియన్స్ కాస్త ఫ్రీ అయ్యాక, టెన్షన్స్ క్లియర్ అయ్యాక రిలీజ్ చేద్దామని ఇప్పటి వరకూ వెయిట్ చేశాం…  ఫైనల్ గా మార్చ్ 3న రాబోతున్నందుకు హ్యాపీ గా ఉంది..

 

రీ షూట్ చేయలేదు

ఆక్చువల్ గా ఈ సినిమా డబ్బు చుట్టూ తిరిగే కథ కాబట్టి నోట్ల రద్దు తర్వాత ఇంకా కొన్ని సీన్స్ చేశారా అని అడుగుతున్నారు. కానీ నాకు తెలిసి అలాంటి రీ షూట్స్ ఏం జరగలేదు… నాకు తెలియకుండా ఏమైనా మనీ మీద క్లోస్ అప్ షాట్స్ తీశారేమో చూడాలి..

 

ఇంకా చూడలేదు

ఈ సినిమా ఇంకా చూడలేదు.. కానీ డబ్బింగ్ చెప్పే టైంలో, ఆర్.ఆర్ జరిగే టైం లో కొంచెం కొంచెం చూశా అంతే ..

 

అలా ఆలోచిస్తూ సినిమా చేయలేను

లేటెస్ట్ గా ఇంటర్వూస్ లో ఏదైనా షోస్ కి వెళ్తుంటే మీ మీద ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి కదా అని అంటున్నారు…వాళ్ళు చెప్తుంటే అవునా అనిపిస్తుంది.. కానీ ఇప్పుడు ఆ   ఎక్స్ పెక్టేషన్స్ గురించి ఆలోచిస్తూ సినిమా చేయలేను.. కథ నచ్చి ఎంజాయ్ చేస్తూ మాత్రమే సినిమా చేస్తా.. అది వాళ్ల ఎక్స్  పెక్టేషన్స్ కి రీచ్ అయితే ఓకే… లేదంటే ఇంకో సినిమా చేస్తా.. అంతే…

 

రెండు లిప్ కిస్సులున్నాయి 

ఈ సినిమా ట్రైలర్ చూసాక అందరు లిప్ లాక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో ఒకటి కాదు రెండు లిప్ లక్స్ ఉన్నాయి. కానీ అవి జస్ట్ కథలో భాగమే తప్ప కావాలని సడన్ గా పెట్టాలని పెట్టినవి కాదు..

 

ఆ హీరోతో పోల్చడం నచ్చలేదు..

నిజానికి అందరు ఈ మధ్య నన్ను హిమేష్ రేషిమియా తో పోల్చడం నచ్చలేదు. నిజానికి అతనొక్కడే లిప్ కిస్సులు పెట్టే మొగోడా.. ఇంకెవ్వరు లేరా అనిపిస్తుంది. పైగా అది అందరికి కాస్త ఇన్సల్ట్ కూడా… లవ్ స్టోరీస్ లో ముద్దులు కామనే కదా..

 

వేయాల్సి వచ్చింది

‘పెళ్లి చూపులు’ సినిమాలో డాన్స్ చేయలేదు. కానీ ఈ సినిమాలో డాన్స్ చేయాల్సి వచ్చింది. కొంచెం రిహాసల్స్ చేసి ఏదో ట్రై చేశా.. చూడాలి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో…

 

ఆఫర్స్ రాలేదు

రీమేక్స్ సినిమాలు చేయాలనీ నాకేం ఆఫర్స్ రాలేదు. వస్తే ఆ సినిమా నచ్చితే కచ్చితంగా చేస్తా..

టైం దొరికితే ఆ రెండే

నిజానికి చిన్నప్పటి నుంచి నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో షూటింగ్ లో గ్యాప్ దొరికితే క్రికెట్ లేదా వాలి బాల్ ఆడుతుంటాను. ఆ రెండు నా ఫేవరెట్ స్పోర్ట్స్…

 

ప్రస్తుతానికి ఆ మూడు సినిమాలు

‘పెళ్లి చూపులు’ తర్వాత చాలా సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ప్రెజెంట్ ఒక మూడు ప్రాజెక్ట్స్ సైన్ చేశా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రాహుల్ అనే యంగ్ డైరెక్టర్ తో పాటు, పరశురామ్ బుజ్జి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నా.. వీటితో పాటు నందిని రెడ్డి డైరెక్షన్ లో కూడా ఓ సినిమా ఉంది. ఇంకా ఓ రెండు సినిమాలున్నాయి…

 

రీజన్ అదే

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండొచ్చు కదా అని అందరు అడుగుతున్నారు. ఎస్పెషల్లీ ట్విట్టర్ ఓపెన్ చేయమంటున్నారు. కానీ నాకు ప్రెజెంట్ కేవలం ఫేస్ బుక్ పేజ్   మాత్రమే ఉంది. ట్విట్టర్ ఓపెన్ చేస్తే అందరికి ఆన్సర్స్ ఇవ్వాలి లేదంటే మన గురించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ వాళ్ళకి కాస్త టైం కేటాయించాలి. సో ప్రెజెంట్ నాకు దాని కోసం టైం లేదు. ట్విట్టర్ ఓపెన్ చేయకపోవడానికి రీజన్ అదే….