సెట్స్ పైకి వచ్చేసిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా

Tuesday,August 07,2018 - 10:12 by Z_CLU

ఈ నెల 15 న గ్రాండ్ గా రిలీజవుతుంది విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’. ఓ వైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూనే మరోవైపు కొత్త సినిమా ‘ డియర్ కామ్రేడ్’ సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చేశాడు ఈ హ్యాప్పెనింగ్ హీరో. గోదావరి జిల్లాలోని తొండంగి లో నిన్నటి నుండి ఫస్ట్ షెడ్యూల్ బిగిన్ చేసింది సినిమా యూనిట్.

డిఫెరెంట్ రోల్స్ తో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాలో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న మోస్ట్ ఇంటెన్సివ్ రోల్ ప్లే చేయనున్నాడు. ‘ ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనే ఈ సినిమా ట్యాగ్ లైన్ ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది.

 

భరత్ కమ్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. విజయ్ సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.