గ్రాండ్ గా లాంచ్ అయిన విజయ దేవరకొండ కొత్త సినిమా

Monday,July 02,2018 - 01:08 by Z_CLU

విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘డియర్ కామ్రేడ్’ ఈ రోజే గ్రాండ్ గా లాంచ్ అయింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా విజయ్ అగ్రెసివ్ లుక్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ టైటిల్ ని రివీల్ చేసిన ఫిల్మ్ మేకర్స్, ఈ రోజు ఈ సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేశారు.

పూజ కార్యక్రమాలతో బిగిన్ అయిన ఈవెంట్ లో M.M. కీరవాణి క్లాప్ కొట్టగా చంద్ర శేఖర్ యేలేటి కెమెరా స్విచ్చాన్ చేశాడు. దర్శకులు సుకుమార్, కొరటాల శివ స్క్రిప్ట్ అందజేశారు. విజయ్ దేవరకొండ యాక్షన్ హీరోలా ప్రెజెంట్ చేయనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటించనుంది. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. భరత్  కమ్మ డైరెక్షన్ లో   మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా  తెరకెక్కనుంది.

 

ఇప్పటికే విజయ్ దేవరకొండ గీతా గోవిందం, ట్యాక్సీవాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరోవైపు ఆనంద్ శంకర్ డైరెక్షన్ లో సెట్స్ పై ఉన్న బైలింగ్వల్ మూవీ ‘నోటా’ తో తమిళంలోనూ ఇంట్రడ్యూస్ కానున్నాడు విజయ్ దేవరకొండ.