కోపంగా... బాధగా ఉంది – విజయ్ దేవరకొండ

Monday,August 13,2018 - 01:07 by Z_CLU

నిన్న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది ‘గీతగోవిందం’ సినిమా యూనిట్. విజయ్ దేవరకొండకి ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్, దానికి తోడు ఈ నెల 15 న రిలీజ్ కి రెడీ అవుతున్న ‘గీతగోవిందం’ బజ్ అన్నీ కలిసి ఈ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే సినిమా సక్సెస్ గ్యారంటీ అని ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో, ఈ సినిమా వీడియోస్ లీకైన విషయం మాట్లాడాల్సి వచ్చినప్పుడు అంతే ఇమోషనల్ అయ్యాడు.

“ నాకు  వచ్చిందే నటించడం… ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేయడం. ఇలా నా సినిమాలు పైరసీ చేసి, వాటిని ఇంటర్నెట్ లో సర్క్యులేట్ చేసినా, నేను అనుకున్నది ఎలాగైనా సాధిస్తా.. ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా, ఎంత ఎక్స్ పెన్సివ్ అయినా ఒక్క నిమిషం ఆలోచించకుండా సినిమాని గొప్ప స్థాయిలో నిలబెట్టారు. మీరు కూడా సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి.” అని చెప్పుకున్నాడు విజయ్ దేవరకొండ.

గోపిసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించాడు. రష్మిక మండన్న హీరోయిన్. బన్ని వాసు ప్రొడ్యూసర్. అల్లు అరవింద్ ఈ సినిమాని సమర్పిస్తున్నాడు.