Vijay Antony - ఇంట్రెస్టింగ్ గా హత్య మోషన్ పోస్టర్

Sunday,July 17,2022 - 10:01 by Z_CLU

తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నాడు. హీరోయిన్ రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

ఈ మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ పెంచింది. లీలను ఎవరు హత్య చేశారు అనే కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుండటం ఈ వీడియోలో చూపించారు. విచారణ జరిపే సీటులో బాయ్ ఫ్రెండ్, ఫొటోగ్రాఫర్, మేనేజర్, ఏజెంట్, పొరుగు మహిళ… వీరిలో ఎవరు హత్య చేశారు. వీరెవరూ కాకుండా లీల హత్యకు మరెవరైనా కారణమా అనే ప్రశ్నలతో మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది.

ఎవరూ ఊహించని వ్యక్తి (విజయ్ ఆంటోనీ) లీలను చంపాడా అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మోషన్ పోస్టర్ కోసం మేకర్స్ ఎంచుకున్న థీమ్ ఆకట్టుకునేలా ఉంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అప్పటివరకు ఈ మిస్టరీ తప్పదంటూ మేకర్స్ టీజింగ్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు. మురళీ శర్మ, జాన్ విజయ్, రాధిక శరత్‌కుమార్, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందించగా.. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.