విజయ్ ఆంటోని ‘రోషగాడు’ టీజర్ రిలీజయింది

Thursday,October 25,2018 - 06:25 by Z_CLU

విజయ్ ఆంటోని ‘రోషగాడు’ టీజర్ రిలీజయింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కంప్లీట్ గా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినట్టు తెలుస్తుంది. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో డిఫెరెంట్ గా ఎంటర్ టైన్ చేసే విజయ్ ఆంటోని, ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు.

‘పోలీసులంటే పుడింగిలే..’ అంటూ స్టార్ట్ అయ్యే ఈ టీజర్ లో కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు మేకర్స్. 2:15 సెకన్ల ఈ టీజర్ లో ఎక్కడా స్టోరీ రివీల్ చేయకుండానే, యాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఎలివేట్ చేశారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని సరసన నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది.

విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి గణేశ డైరెక్టర్. ఫాతిమా విజయ్ ఆంటోని ప్రొడ్యూసర్. విజయ్ ఆంటోని మ్యూజిక్ కంపోజ్ చేశాడు.