థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో విజయ్ ఆంటోని ‘కాశి’ ట్రైలర్

Friday,March 23,2018 - 07:21 by Z_CLU

విజయ్ ఆంటోని ‘కాశి’ ట్రైలర్ రిలీజయింది. తన ప్రతి సినిమా సమ్ థింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసుకునే విజయ్ ఆంటోని, ఇప్పుడు  తన  అప్  కమింగ్  థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ ‘కాశి’  సినిమాతో  క్యూరాసిటీ  రేజ్  చేస్తున్నాడు.  ఈ రోజు ఈ సినిమా ట్రైలర్  రిలీజయింది.

కృతుంగ ఉదయనిధి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో  తన గతాన్ని తలుచుకుంటూ,  పసితనంలో తన తల్లిదండ్రులు ఎందుకు తనను వదిలించుకున్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇండియాకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది…? అసలు తన పుట్టుక, తన తల్లి మరణం వెనక ఉన్న కారణాలేంటి..? లాంటి ఎలిమెంట్స్ తో అల్టిమేట్ థ్రిల్లర్ లా తెరకెక్కుతుందీ సినిమా.

 

విజయ్ ఆంటోని సరసన అంజలి, సునయన హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఫాతిమా విజయ్ ఆంటోని బ్యానర్ పై తెరకెక్కుతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు.