సక్సెస్ ఫార్ములా రిపీట్ చేస్తున్న విజయ్ ఆంటోనీ

Saturday,May 12,2018 - 10:04 by Z_CLU

విజయ్ ఆంటోని మరో డిఫెరెంట్ థ్రిల్లర్ తో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కిరుతిగ ఉదయనిధి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘కాశి’ ఈ నెల 18 న గ్రాండ్ గా రిలీజవుతుంది. అయితే ఈ సినిమాలో తనకు బాగా  కలిసివచ్చిన మదర్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నాడు విజయ్ ఆంటోని.

సెన్సేషనల్ మూవీ ‘బిచ్చగాడు’ లో మదర్ సెంటిమెంట్ తో అందరినీ ఎట్రాక్ట్ చేశాడు విజయ్ ఆంటోని. ఈ సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు. కాశి ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ కి భారీ స్కోప్ ఉన్నట్టు తెలుస్తుంది. తనను ఎన్నాళ్ళుగానో వెంటాడుతున్న మిస్టీరియస్ డ్రీమ్ ని ఛేదించడానికి ఇండియా వచ్చిన హీరో ఏం తెలుసుకున్నాడు అనేదే ఈ సినిమాలోని ప్రధానాంశం గా తెలుస్తుంది.

 

ఈ సినిమాలో విజయ్ ఆంటోని సరసన అంజలి, సునయన హీరోయిన్స్ గా నటించారు. ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రద్యుమ్నా చంద్రపతి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి విజయ్ ఆంటోని మ్యూజిక్ కంపోజ్ చేశాడు.