విజయ్ ఆంటోని ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Tuesday,February 21,2017 - 02:45 by Z_CLU

ప్రస్తుత రాజకీయాలతో యమన్ కు సంబంధం లేదు

యమన్ పక్కా పొలిటికల్ థ్రిల్లర్. సినిమాలోని ప్రతి సన్నివేశం ఫ్యాబ్రికేటెడ్. ఇది రియల్ లైఫ్ ఇన్సిడెన్స్ నుంచో, ప్రస్తుతం జరుగుతున్న పొలిటికల్ సినారియో నుంచో రెఫరెన్స్ గా తీసుకున్నది కాదు.

 

అందరూ కరప్టెడే

పాలిటిక్స్ లో మ్యాగ్జిమం కరెప్టెడే. మహా అయితే ఒక 30% పొలిటీషియన్స్ జెన్యూన్ గా ఉంటారేమో కానీ 70% కరప్టెడ్ పొలిటీషియన్స్. అయినా రాజకీయాల్లో మాత్రమే అవినీతి ఉందనుకుంటాాం కానీ, ప్రతి చోటా ఉంది. జెన్యూనిటీ చాలా రేర్ గా కనిపిస్తుంటుంది.

 

యమన్ కరప్టెడ్ పాలిటీషియన్స్ కోసమే

యమన్ నెగెటివ్ క్యారెక్టర్ కాదు. ఆ పేరు వినడానికి అలా ఉంటుంది కానీ… కచ్చితంగా నెగెటివ్ అయితే కాదు. ఈ సినిమాలో రాజకీయాాల్ని డిఫెరెంట్ గా చూపించే ప్రయత్నం చేశాం.

ఎవరైనా ఏ సినిమా అయినా చేయొచ్చు

సినిమాకి హీరో ఇమేజ్ ఎప్పుడూ సెకండరీనే. కాన్సెప్ట్ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి కానీ, ఏ సినిమా ఎవ్వరైనా చేయొచ్చు. అందుకే విజయ్ సేతుపతి లాంటి బిగ్గెస్ట్ స్టార్ కోసం రాసుకున్న కాన్సెప్ట్ అని తెలిసినా నేను సంతకం చేశాను.

 

యాక్టర్స్ సినిమాని నిర్మించాలి

యాక్టర్స్… ముఖ్యంగా హీరోలు కూడా సినిమాలు నిర్మించాలి. అప్పుడే ప్రొడ్యూసర్ కష్టాలు తెలుస్తాయి. ప్రమోషన్స్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి… వాటి ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది.

 

సినిమాకి గ్లామర్ అవసరం లేదు

సినిమాకి స్టోరీ అవసరం.. స్టోరీలో దమ్ముండాలి. ఆ తర్వాతే హీరోలు, హీరోయిన్స్, టెక్నీషియన్స్ ఇంకేమైనా. గ్లామరస్ గా కనిపించాలి… ఫిజిక్ మెయిన్ టైన్ చేయాలి అనే ఆలోచన నాకెప్పుడూ లేదు.

తెలుగు ఆఫర్స్ ని రిజెక్ట్ చేస్తున్నారా..?

లేదు నిజం చెప్పాలంటే ఎవరూ అప్రోచ్ అవ్వలేదు. మంచి స్టోరీతో ఎవరైనా సంప్రదిస్తే కచ్చితంగా బైలింగ్వల్ ప్రాజెక్ట్ చేస్తా.

డైరెక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు..?

నెక్స్ట్ ప్రాజెక్ట్ బైలింగ్వల్ ప్రాజెక్ట్. తెలుగు, తమిళంలో ఒకేసారి షూట్ చేసి, రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం. డీటేల్స్ త్వరలో అనౌన్స్ చేస్తాం.

 

నో నెగెటివ్ రోల్

ప్రస్తుతానికి నో నెగెటివ్ రోల్ అనుకుంటున్నా. నాకు విలన్స్ అంటే అస్సలిష్టం ఉండదు. అందుకే అలాంటి క్యారెక్టర్ ని నేను హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే.

 

సినిమాకి సాంగ్స్ అవసరం లేదు

నేను స్వతహాగా మ్యూజిక్ డైరెక్టర్నే అయినా, మ్యూజికల్ హిట్ అన్న పదాన్ని అంత ఈజీగా యాాక్సెప్ట్ చేయను. మ్యూజిక్ వేరు. సినిమా వేరు. మ్యూజిక్ డైరెక్టర్ గా నా ప్యాషన్ ని ఫుల్ ఫిల్ చేసుకోవడానికి ఆల్బమ్స్ రిలీజ్ చేసుకుంటాను కానీ అవసరం ఉన్నా లేకపోయినా నా సినిమాల్లో జొప్పించిన సాంగ్స్ ఉండవు.

డైరెక్షన్ చేసే ఆలోచన ఉందా..?

నేను కూడా డైరెక్షన్ చేయొచ్చు అనే ఫీలింగ్ నాకెప్పుడూ ఉంటుంది కానీ చేయను. నా మైండ్ లో అసలా ఆలోచన లేదు. మంచి సినిమా పబ్లిక్ కి రీచ్ అవ్వాలి. ఆ పబ్లిక్ కి నేను దగ్గరగా ఉండాలి. ప్రస్తుతానికి ఇంతే.

 

బిచ్చగాడు సక్సెస్ కి ముందు తరవాత..

బిచ్చగాడు సినిమాకి ముందు నా పరిస్థితి బిచ్చగాడి లాంటిదే. ఆ సినిమా కోసం పడ్డ స్ట్రగుల్ లైఫ్ లో మరిచిపోను… బిచ్చగాడు రిలీజ్ తరవాత కంప్లీట్ స్ట్రాటజీ మారింది.. కానీ నేను మారలేదు.. నేను అంతే… నా ప్యాషన్ టువర్డ్స్ సినిమా మారలేదు.

 

యమన్ హీరోయిన్

ఈ సినిమాలో మియా జార్జ్ నా లైఫ్ పార్టనర్… తను సినిమా ఆర్టిస్ట్ గా నటించిందీ సినిమాలో… తన పర్ఫామెన్స్ కూడా సినిమాకి పెద్ద ఎసెట్.

 

కరియర్ ప్లానింగ్

పెద్ద ప్లానింగ్ ఏం లేదు.. పెద్దగా ప్రెజర్ తీసుకోదలుచుకోలేదు. ప్రొడ్యూసర్స్ ని క్యూలో ఉంచాలి అనుకోవడం లేదు. ఒక సినిమా తరవాత ఇంకో సినిమా.. ఆ సినిమా తరవాతే ఇంకో సినిమా… బంచ్ గా సినిమాలు ఒప్పుకోను… టెన్షన్స్ పెట్టుకోను..