విజయ్ ఆంటోని ఇంటర్వ్యూ

Tuesday,November 28,2017 - 01:43 by Z_CLU

‘బిచ్చగాడు’ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపును సాధించుకున్న విజయ్ ఆంటోని బ్యాక్ టు బ్యాక్ డిఫెరెంట్ సినిమాలతో ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఇప్పడు ఈ నెల 30 న రిలీజ్ కానున్న ‘ఇంద్రసేన’ సినిమా కూడా తన మార్క్ సక్సెస్ సాధించడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న విజయ్ ఆంటోని, ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. ఆ చిట్ చాట్ మీకోసం…

నేను నటించలేను….

నేను మంచి నటుణ్ణి కాను.. మంచి కథల్ని ఎంచుకుంటాను. అందులో నా క్యారెక్టర్ ని బట్టి నాకు వచ్చినట్టు ఎక్స్ ప్రెస్ చేస్తాను. ఈ సినిమాలో నా కరియర్ లోనే ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్ లో నటించాను. యమన్ లో కూడా డ్యూయల్ రోల్ లో నటించినా, ఫాదర్ చనిపోయాక కొడుకు రోల్ లో కనిపించాను కానీ ఈ సినిమాలో ఒకేసారి రెండు క్యారెక్టర్స్ లో కనిపిస్తాను…

నా దృష్టిలో ఇవే కమర్షియల్ మూవీస్….

నా దృష్టిలో ఒక సినిమా ఆడిందంటే అది డెఫ్ఫినేట్ గా కమర్షియల్ సినిమానే… నా సినిమాలు ‘నకిలీ’ నుండి బిగిన్ అయితే ‘ఇంద్రసేన’ వరకు కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఆలోచించి చేసినవే… నన్ను ఆడియెన్స్ ఎంత వరకు ఆక్సెప్ట్ చేయగలరో అంత వరకే నా స్పేస్.. దానికన్నా అతి చేస్తే ఆడియెన్స్ కనెక్ట్ అవ్వరని నా ఫీలింగ్….

నేను నిర్మాతగా మారడానికి అదే రీజన్…

నాకు ఒక స్టోరీ నచ్చిందంటే ప్రతీది నా కంట్రోల్ లోకి తెచ్చుకుంటాను. ఒకవేళ నేను వేరే ప్రొడ్యూసర్ తో పని చేస్తే, నేను చెప్పదలుచుకున్నది కూడా వాళ్ళకు అర్థం కాకపోవచ్చు, ఆక్టింగ్ లో నాకున్న లిమిటెడ్ క్యాపబిలిటీస్ వాళ్ళ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోవచ్చు. అందుకే నా సినిమాలు నేనే నిర్మించుకుంటున్నాను…

ఇంద్రసేన మెయిన్ కథ అదే…

ఇంద్రసేన, రుద్రసేన అనే ఇద్దరు అన్నాదమ్ములు… ఇంద్రసేన తన లవ్ ని కోల్పోయి బాధలో తాగుబోతులా మారిపోతాడు. రుద్రసేన స్కూల్ లో ఫిజికల్ ట్రేనర్ లా పనిచేస్తూ చాలా డిసిప్లేన్ గా ఉంటాడు. ఇంతలో ఈ ఇద్దరి సిచ్యువేషన్స్ ని, ఆటిట్యూడ్స్ ని డామినేట్ చేసే ప్రాబ్లమ్ రేజ్ అవుతుంది. అదేంటి..? ఆ తరవాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ.

న్యాయం చేయలేనేమో…

నేను నా సినిమాలకు తప్ప వేరే సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేయడం లేదు.. ఆఫర్స్ వస్తున్నా ఎందుకో నేనా సినిమాలకు న్యాయం చేయలేనేమోనన్న ఫీలింగ్ తో ఆక్సెప్ట్ చేయడం లేదు. నేను నా సినిమాలతో బిజీగా ఉన్నాను… స్క్రిప్ట్ దగ్గరి నుండి ఎడిటింగ్ వరకు ప్రతీది దగ్గరి నుండి చూసుకుంటాను.. అలాంటప్పుడు వేరే సినిమాలపై ఫోకస్ చేయలేను అందుకే, బయటి ప్రాజెక్ట్స్ కి పని చేయడం లేదు…

 

 

గుడ్డిగా వెళ్ళిపోతున్నా…

నేను మ్యూజిక్ నేర్చుకోలేదు… హిందూస్తాణీ కానీ కర్ణాటక మ్యూజిక్ కానీ అసలు నాకేమీ తెలీదు… ఎప్పుడైతే నేను ట్యూన్స్ కంపోజ్ చేయగలను అని అర్థమయిందో, నేను నా ఫార్మాట్ లో మ్యూజిక్ కంపోజ్ చేయడం నేర్చుకున్నాను. మీరు నా సినిమాలు గమనిస్తే చాలా లైట్ మ్యూజిక్ ని ప్రిఫర్ చేస్తాను…

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ..

రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ‘రోషగాడు’ మూవీతో పాటు ‘కాళి’ మూవీ చేస్తున్నాను. తెలుగులో ‘కాళి’ టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలో రివీల్ చేస్తాము…