విజయ్ ఆంటోని ‘ఇంద్రసేన’ ట్రైలర్ రివ్యూ

Thursday,October 12,2017 - 12:40 by Z_CLU

విజయ్ ఆంటోని ‘ఇంద్రసేన’ ట్రైలర్ రిలీజయింది. విజయ్ ఆంటోని సినిమా అంటేనే డిఫెరెంట్ ఎంటర్ టైనర్ అనే ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ హీరో ‘ఇంద్రసేన’ సినిమాతో మరో సెన్సేషన్ ని క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. G. శ్రీనివాసన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రివ్యూ.

‘స్ట్రేట్ గా వెళ్లి రైట్ తీసుకుంటే ఒక ఓటమి ఎదురవుతుంది..’  అంటూ బిగిన్ అయ్యే ఈ మూవీ ట్రైలర్ ని బట్టి ‘ఇంద్రసేన’ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. ఒక పనిని మొదలుపెట్టినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి..? చివరికి ఆ లక్ష్యాన్ని రీచ్ అయ్యే లోపు ఎటువంటి ఎక్స్ పీరియన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనే థీమ్ తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తుంది.

రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ అంటోని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో డయానా చంపిక, మహిమ, జ్యువెల్ మేరీ హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ ఆంటోని ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజర్.