అప్పుడు బిచ్చగాడు... ఇప్పుడు భేతాళుడు

Sunday,October 09,2016 - 10:47 by Z_CLU

లేటెస్ట్ గా టాలీవుడ్ లో గ్రాండ్ హిట్ అందుకున్న డబ్బింగ్ సినిమా ‘బిచ్చగాడు’. విడుదలైన తొలి రోజే సూపర్ హిట్ అందుకొని టాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం తో టాలీవుడ్ లో స్టార్ అయిపోయాడు విజయ్ ఆంటోనీ. కేవలం 20లక్షల రూపాయలు పెట్టి కొన్న ఈ సినిమా… తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్ల రూపాయలు వసూలు చేసిందంటే.. బిచ్చగాడు హవాను అర్థంచేసుకోవచ్చు.
vijay-antony
బిచ్చగాడు ఇచ్చిన ఉత్సాహంతో విజయ్ ఆంటోనీ ఇప్పుడు మరో సినిమా రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో తమిళ్ లో ఓ సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ లో విజయ్ కి మార్కెట్ ఉండడంతో ఇప్పుడు ఈ సినిమాను కూడా ‘బేతాళుడు’ పేరుతో తెలుగులో డబ్బింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ అందరినీ ఆకట్టుకొని సినిమా పై అంచనాలు పెంచేసింది. మరోవైపు బిచ్చగాడు ఎపెక్ట్ తో భేతాళుడు తెలుగు డబ్బింగ్ రైట్స్ ను దక్కించుకునేందుకు  చాలామంది పోటీపడుతున్నారు. ఈసారి విజయ్ ఆంటోనీ సినిమాకు డీసెంట్ ఎమౌంట్ దక్కే అవకాశం ఉంది. నవంబర్ లో భేతాళుడు భయపెట్టబోతున్నాడు.