ఎన్టీఆర్ సెట్స్ లో అడుగుపెట్టిన విద్యాబాలన్

Wednesday,July 18,2018 - 03:31 by Z_CLU

క్రిష్, బాలయ్య కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో కీలకమైన పాత్ర కోసం విద్యాబాలన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి విద్యాబాలన్ వచ్చింది. ఆమెకు ఘనంగా స్వాగతం పలికింది సినిమా యూనిట్. ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించనుంది.

బసవతారకం గురించి బయట వ్యక్తులకు తెలిసింది చాలా తక్కువ. అలాంటి వ్యక్తి గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేసింది విద్యాబాలన్. దాదాపు 4 రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్న ఈ హీరోయిన్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి బసవతారకం వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య చిన్నకూతురు తేజస్విని, భార్య వసుంధర.. విద్యాబాలన్ కు పట్టుచీర బహుకరించారు.

విద్యాబాలన్ రాకతో ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్ర ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈనెల 5వ తేదీ నుంచి సెట్స్ పైకి వచ్చింది ఎన్టీఆర్ బయోపిక్. ప్రస్తుతం నడుస్తున్న షెడ్యూల్ లో ఎన్టీఆర్-బసవతారకం మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.