ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్

Thursday,July 05,2018 - 12:23 by Z_CLU

మొన్నటివరకు ఇది రూమర్ మాత్రమే. కానీ ఇప్పుడిది పక్కా అయింది. ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్ నటించనుంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించనుంది. ఇక ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ కనిపించనున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.

ఎన్టీఆర్ బయోపిక్ ను 2 భాగాలుగా తీసుకురాబోతున్నారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు క్రిష్-బాలయ్య కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.

ఎన్టీఆర్ బయోపిక్ తో బాలయ్య నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. బాలయ్యతో కలిసి సాయి కొర్రపాటి, విష్ణువర్థన్ ఇందూరి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత మిగతా నటీనటులు, టెక్నీషియన్ల వివరాల్ని వెల్లడిస్తారు.