విక్టరీ వెంక‌టేష్ `నార‌ప్ప` షూటింగ్ రీస్టార్ట్

Friday,November 06,2020 - 03:57 by Z_CLU

సురేష్ ప్రొడక్షన్స్,  వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న భారీ చిత్రం `నారప్ప`. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి  చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.

లాక్ డౌన్‌కి ముందే శరవేగంగా 60 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ రీసెంట్‌గా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హైద‌రాబాద్ ప‌రిస‌ర‌ప్రాంతాల్లో షూటింగ్ రీస్టార్ట్ చేసింది.

అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో  నారప్ప‌ షూటింగ్ మొదలైంది. తర్వాత తమిళ నాడులోని కురుమలై మ‌రియు తిరిచందూర్ సమీపంలో ఉన్న తెరికాడు రెడ్ డెసర్ట్ లో కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేశారు. ఆ తర్వాత లాక్ డౌన్ వల్ల సినిమా ఆగిపోయింది. అలా ఆగిన షూటింగ్ ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లో మళ్లీ మొదలైంది.

ప్రియమణి, రావు రమేష్, రాజీవ్ కనకాల పాల్గొనగా కీలకమైన సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో  80 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. మిగిలిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను  కూడా త్వరలోనే పూర్తిచేసి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.

నటీనటులు : విక్టరీ వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు,
సంగీతం: మణిశర్మ,
ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌,
ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌,
కథ: వెట్రిమారన్‌,
స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్,
ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌,
లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం,
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను
దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.