మల్టీస్టారర్స్ కి లక్కీస్టార్

Wednesday,February 27,2019 - 10:02 by Z_CLU

వెంకీ మరో మల్టీస్టారర్ స్టార్ట్ చేశాడు. ఈసారి మేనల్లుడితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ‘F2’ తరవాత వెంకీ నుండి రాబోతున్న సినిమా కావడంతో న్యాచురల్ గానే ఈ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అంతెందుకు వెంకీ అంటేనే మల్టీస్టారర్ కి కేరాఫ్ అడ్రస్ లా మారుతున్నాడు. ఓ మల్టీస్టారర్ లో వెంకీ ఉన్నాడా..? సినిమా సక్సెస్ గ్యారంటీ అనే ఇమేజ్ క్రియేట్ అవుతుంది.

F2: ఈ సినిమా విషయానికి వస్తే టీజర్ రిలీజ్ అయినప్పుడే రిజల్ట్ డిక్లేర్ అయింది. భార్యా బాధితుడిగా వెంకీ న్యాచురల్ పర్ఫామెన్స్ కి ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేడు. ఆడియెన్స్ పల్స్ తెలిసిన స్టార్ విక్టరీ వెంకటేష్ అని మరోసారి గుర్తు చేశాడు.

 

 గోపాల గోపాల : వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. కానీ సిల్వర్ స్క్రీన్ పై మాత్రం వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అవుట్ స్టాండింగ్ అనిపించుకుంది. సినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లోనే అయినా, వెంకీ, పవన్ కళ్యాణ్ ల రియల్ టైమ్ కెమిస్ట్రీ ఆడియెన్స్ కి రియల్ ఎక్స్ పీరియన్స్ అనేంతలా రీచ్ అయింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : ఉన్నపళంగా సిచ్యువేషన్ కి తగ్గటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మారిపోవడాలు, హీరోలో మాసిజం ఎలివేట్ అవ్వడాలు లాంటి జిమ్మిక్కులేవీ లేకుండా, మోస్ట్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన సినిమా. మహేష్ బాబు మ్యాజిక్ మహేష్ బాబుదే. అనుమానం లేదు కానీ వెంకీ వల్ల ఆ మ్యాజిక్ డోస్ మరింత పెరిగింది.

ఇప్పుడు ఇదే వరసలో వెంకీమామ కూడా వస్తుంది కాబట్టి అదే రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.  ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యూనిట్ వెంకీ, చైతుల కాంబినేషన్ లో ‘వెంకీ మామ’ అంటూ సాగే టైటిల్ సాంగ్ ని తెరకెక్కించనున్నారు.