విక్టరీ వెంకటేష్ – డైరెక్టర్స్ కి మోస్ట్ ఫేవరేట్

Wednesday,May 08,2019 - 10:03 by Z_CLU

ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్ దృష్టిలో ఉన్నాడు వెంకీ. ఎలాంటి కథకైనా సూటవుతాడు. యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ జోనర్ ఏదైనా సింక్ అయిపోతాడు. అందుకే వెంకీతో మాట్లాడ్డానికి 2 నిమిషాలు దొరికినా, స్క్రిప్ట్ చెప్పి ఇంప్రెస్ చేసేస్తున్నారు మన డైరెక్టర్స్.

కొంచెం కథ కొత్తగా ఉండాలనే రూల్ తప్ప ఏ జోనర్ అయినా అబ్జెక్షన్ చెప్పడు. అందుకే వెంకీ కోసం ప్రతి డైరెక్టర్ దగ్గర ఓ కథ రెడీగా ఉంటుంది. అందుకే ‘F2’ సెట్స్ పై ఉండగానే ఇంకో కథ చెప్పగలిగాడు అనిల్ రావిపూడి. వీళ్ళిద్దరి సినిమా సెట్స్ పైకి రావాలంటే కావాల్సింది టైమ్ ఒక్కటే.

త్రివిక్రమ్ కూడా అంతే. ఇప్పుడు చేద్దాం.. అప్పుడు చేద్దాం లాంటి కండిషన్స్ ఏమీ లేకుండా సింపుల్ గా కథ  చెప్పేసి ఒప్పించాడు. హారిక-హాసిని బ్యానర్ పై రాబోతున్న వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరి కన్నా టైమ్ కలిసొచ్చింది మాత్రం త్రినాథ రావు నక్కినకే. అటు ‘వెంకీ మామ’ షూటింగ్ కంప్లీట్ అవుతుండటం.. ఇటు ఈ డైరెక్టర్ కూడా ఆల్మోస్ట్ రెడీగా ఉండటం లాంటివి మ్యాచ్ అయ్యేసరికి వీళ్ళిద్దరి సినిమా సెట్స్ పైకి రావడానికి ప్రిపరేషన్స్ స్పీడ్ గా ఊపందుకున్నాయి.