Chiranjeevi Bholaa Shankar - ఫస్ట్ లుక్ రిలీజ్

Tuesday,March 01,2022 - 12:32 by Z_CLU

Vibe of Bholaa – Chiranjeevi Bholaa Shankar first look revealed

మెగా అభిమానులకు భోళాశంకర్‌ చిత్రయూనిట్‌ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ సినిమా నుంచి అప్ డేట్ విడుదల చేసింది. చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్ గా, మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. మహా శివరాత్రి సందర్భంగా ‘వైబ్‌ ఆఫ్‌ భోళా’ పేరుతో చిత్ర యూనిట్‌ ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌ను, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

స్వాగ్ ఆఫ్ భోళా పేరుతో ఇప్పటికే ఓ లుక్ రిలీజ్ చేసింది యూనిట్. ఇప్పుడు వైబ్ ఆఫ్ భోళా పేరుతో విడుదల చేసిన లుక్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. జీపు ముందు కూర్చొని త్రిశూలం ఉన్న చైన్ ను తిప్పుతూ చిరంజీవి మాస్ లుక్ లో కనిపిస్తున్నారు.

అన్నాచెల్లెల అనుబంధం నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న సినిమా ఇది. అయినప్పటికీ మాస్-కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో నడుస్తోంది. చిరంజీవితో పాటు మరికొంతమంది ఆర్టిస్టులతో ఓ షెడ్యూల్ చేస్తున్నారు.

bholaa shankar

జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్, ఈ సినిమాలో చిరంజీవికి సోదరిగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో హీరోయిన్ గా కనిపించనుంది. యువ సంచలనం మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి రాబోతోంది భోళాశంకర్.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics