కీర్తి సురేష్ కి ఇది చాలా స్పెషల్ మూవీ

Sunday,March 24,2019 - 05:03 by Z_CLU

ఎంత కష్టపడినా కీర్తి సురేష్ విషయానికి వచ్ఛేసరికి అదృష్టం డోస్ కొంచెం ఎక్కువే. అందుకే ఇంత తక్కువ టైమ్ లో స్టార్ హీరోస్ సరసన అవకాశాన్ని దక్కించుకుంది. దానికి తోడు ఇప్పుడు బాలీవుడ్ సినిమా. అయితే సాధారణంగా బాలీవుడ్ ఎంట్రీ ఏదో గ్లామరస్ రోల్ తో ఇవ్వట్లేదు కీర్తి సురేష్. ఆ సినిమాలో 2 డిఫెరెంట్ రోల్స్ లో కనిపించనుంది.

సినిమాలో ఒక క్యారెక్టర్ రెగ్యులర్ హీరోయిన్ తరహాలోనే ఉన్నా, మరో క్యారెక్టర్ లో మాత్రం మధ్య వయసు ఉన్న మహిళగా మెచ్యూర్డ్ లుక్స్ లో కనిపించనుందట కీర్తి సురేష్. అయితే దీనికోసం కనీసం ప్రొస్థెటిక్ మేకప్ కూడా అవసరం లేకుండా న్యాచురల్ పర్ఫామెన్స్ తోనే మెస్మరైజ్ చేయనుందట కీర్తి సురేష్. కారియర్ లో ఇంత ఫాస్ట్ గా చాలెంజింగ్ రోల్స్ ప్లే చేసే అవకాశం వస్తున్నందుకు మురిసిపోతుందతట కీర్తి సురేష్.

ఇండియన్ ఫుట్ బాల్ ప్లేయర్, ట్రైనర్ సయ్యద్‌ అబ్దుల్‌ ఇబ్రహీం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో కరియర్ లో మరో మెట్టెక్కనుంది కీర్తి సురేష్. బోనీకపూర్ ఈ సినిమాకి నిర్మాత. అమిత్ శర్మ డైరెక్టర్.