వెంకీ మామ పోస్ట్ పోన్

Sunday,August 18,2019 - 01:02 by Z_CLU

విక్టరీ వెంకటేష్ , నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘వెంకీ మామ’ అక్టోబర్ 2న రిలీజ్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకూ అదే డేట్ ఫిక్సయ్యారు. అయితే ఇప్పుడు అదే తేదికి గాంధీ జయంతి సందర్భంగా ‘సైరా’ రానున్నట్లు  ప్రకటించేశారుమేకర్స్.  ప్రమోషన్స్ కూడా మొదలెట్టేసారు. అందుకే ఇప్పుడు ‘వెంకీ మామ’ సినిమాను పోస్ట్ చేసుకున్నారు. అక్టోబర్ లో రావడం పక్కా కానీ అది తేది అన్నది మాత్రం ఇంకా డిసైడ్ అవ్వలేదట.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో రిలీజ్ డేట్ ని ప్రకటించే పనిలో ఉన్నారు నిర్మాతలు. వెంకీ సరసన పాయల్, చైతు సరసన రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా సురేష్ బాబు, విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.