కెరీర్ లో ఫస్ట్ టైం....

Monday,March 06,2017 - 12:27 by Z_CLU

సీనియర్ హీరోలలో చిరంజీవి, నాగార్జున ఇప్పటికే కొన్ని సందర్భాలలో సింగర్ గా అవతారమెత్తి ఫాన్స్ ను ఖుష్ చేసేశారు.. ఇప్పుడు ఆ లిస్ట్ లో వెంకటేష్ కూడా చేరిపోయాడు… కెరీర్లో ఫస్ట్ టైం ‘గురు’ సినిమాతో సింగర్ అవతారమెత్తి హంగామా చేస్తున్నాడు విక్టరీ వెంకటేష్… సుధాకొంగర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నాడు..

లేటెస్ట్ గా ఈ సినిమాలోని ‘జింగిడి’ అనే డ్రింకింగ్ సాంగ్ ను పాడి ఫాన్స్ ను ఖుషి ముంచేశాడు.. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ” సడెన్ గా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మా టీం, మీరూ ఒక సాంగ్ పాడితే బాగుంటుంది అన్నారు.. ఇంటికెళ్లి మనం పాడటం అవసరమా అని ఆలోచించా.. సాంగ్ బాగా నచ్చింది.. పైగా డ్రింకింగ్ సాంగ్ కాబట్టి దాంట్లో కాస్త వర్డ్స్ అటు ఇటు అయినా ప్రేక్షకులు క్షేమించేస్తారనే కాన్ఫిడెంట్ తో వెళ్లి పాడేశాను…” అన్నారు.. వెంకీ పాడిన ఈ మేకింగ్ సాంగ్ వీడియో, ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.. సో ‘గురు’ తో ఎట్టకేలకి సింగర్ గా మరిన వెంకీ నెక్స్ట్ సినిమాలలో కూడా సింగర్ గా ఇలాగే అలరిస్తాడేమో చూడాలి..