మార్చి 12 నుంచి తేజ-వెంకీ సినిమా

Friday,March 02,2018 - 12:53 by Z_CLU

విక్టరీ వెంకటేశ్, దర్శకుడు తేజ కాంబినేషన్ లో రానున్న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 12 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ షెడ్యుల్ లో వెంకీ కూడా జాయిన్ అవుతున్నాడు.   వెంకటేష్ తో పాటు కొత్తవారిపై  కొన్ని  కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు యూనిట్.

ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావాల్సింది. ఈ మూవీకి “ఆట నాదే-వేట నాదే” అనే టైటిల్ అనుకుంటున్నారు. వెంకీ సరసన శ్రియ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో నారా రోహిత్ ఓ కీ రోల్ లో కనిపించబోతున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ మూవీకి సంగీత దర్శకుడు.