వెంకీ - తేజ సినిమా అప్ డేట్స్

Sunday,April 01,2018 - 06:06 by Z_CLU

‘గురు’ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్ ఎట్టకేలకు నెక్స్ట్ సినిమాతో సెట్స్ పైకి వెల్లబోతున్నాడు. తేజా డైరెక్షన్ లో వెంకీ నటించబోతున్న సినిమా ఏప్రిల్ 9 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఫ్యామిలీ & యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రియ హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమాలో మరో హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నారు మేకర్స్.

నారా రోహిత్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ , ఎ.కే.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సురేష్ బాబు , అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించనున్నారు. అనుప్ రుబెన్స్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.