'అజ్ఞాతవాసి' లో వెంకీ ఎంట్రీ అదుర్స్

Sunday,January 07,2018 - 10:06 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్స్ కి రానున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో విక్టరి వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నదన్న సంగతి కూడా తెలిసిందే. అయితే వెంకటేష్ ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ తో ఎంట్రీ ఇస్తాడనే చర్చ నడుస్తుంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ సందర్భంలో ఇరానీ హోటల్ లో ఓ ఫైట్ ఉంటుందని, ఆ ఫైట్ తర్వాత వెంకీ తన మానరిజం తో ఎంట్రీ ఇస్తాడని, ఆ ఎంట్రీ థియేటర్స్ లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఫాన్స్ లో మరింత జోష్ పెంచుతుందని తెలుస్తుంది. అయితే అలా ఓ ముఖ్య సందర్భంలో ఎంట్రీ ఇచిన వెంకీ ఓ ఐదు నిమిషాల పాటు పవన్ తో కలిసి కనిపిస్తాడని సమాచారం. ‘గోపాల గోపాల’ సినిమాతో ఫాన్స్ ని ఫుల్ ఖుషి చేసిన పవన్-వెంకీ అజ్ఞాతవాసి సినిమాతో మరో సారి ఫాన్స్ లో జోష్ తీసుకురానున్నరన్నమాట.