మరో కొత్త క్యారెక్టర్ తో రాబోతున్న వెంకీ

Monday,August 07,2017 - 03:06 by Z_CLU

‘గురు’తో సూపర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడా.. ఏ డైరెక్టర్ తో సెట్స్ పై వెళ్తాడా.. అనే క్యూరియాసిటీ తో వెయిట్ చేస్తున్నారు దగ్గుబాటి ఫాన్స్. అయితే లేటెస్ట్ గా వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు నిర్మాత సురేష్ బాబు. పూరి, క్రిష్ లతో వెంకీ సినిమా చేస్తాడనే వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టేశారు సురేష్ బాబు.

‘నేనే రాజు నేనే మంత్రి’ ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన సురేష్ బాబు వెంకటేష్ నెక్స్ట్ సినిమా భారీ బడ్జెట్ తో గ్రాఫికల్ వండర్ గా ఉండబోతుందని, ఓ కొత్త కథ తో ఈ సినిమా ఉంటుందని, ఓ జంతువు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనుందని, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ కొత్త డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడని, ప్రెజెంట్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలిపాడు. సో వెంకీ త్వరలోనే ఓ భారీ బడ్జెట్ సినిమాతో ఎంటర్టైన్ చేయబోతున్నాడన్నమాట.