వెంకీ మామ వచ్చేది ఎప్పుడు?

Monday,November 18,2019 - 02:31 by Z_CLU

వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న వెంకీమామ సినిమాకు సంబంధించి చాలా తేదీలు డిస్కషన్ కు వచ్చాయి. కానీ ఏదీ ఫైనల్ అవ్వలేదు. ఒక దశలో సంక్రాంతికి వస్తుందనే టాక్ కూడా గట్టిగా వినిపించింది. కానీ సంక్రాంతి రేస్ నుంచి కూడా ఈ సినిమా తప్పుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో డేట్ బయటకొచ్చింది. అదే డిసెంబర్ 13.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ 13న ఈ సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఈ మేరకు నిర్మాత సురేష్ బాబు, ప్రొడక్షన్ యూనిట్ కు సమాచారం ఇచ్చారట. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఆరోజు వెంకటేష్ పుట్టినరోజు. సో.. వెంకీ బర్త్ డే స్పెషల్ గా వెంకీమామ వస్తోందన్నమాట.

రీసెంట్ గా ఈ సినిమా ఫైనల్ కట్ చూశాడు హీరో నాగచైతన్య. ఫస్టాఫ్ లో కామెడీ, సెకెండాఫ్ లో యాక్షన్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయని మెచ్చుకున్నాడు. సినిమాలో చైతూ సరసన రాశిఖన్నా, వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబి ఈ సినిమాకు దర్శకుడు.