రాజమండ్రిలో ‘వెంకీమామ’

Tuesday,February 05,2019 - 03:28 by Z_CLU

‘వెంకీమామ’ కి డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 22 నుండి సెట్స్ పైకి వచ్చేస్తుంది ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ. ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన మేకర్స్, రాజమండ్రిలో సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ కి సంబంధించిన ప్రిపరేషన్స్ లో ఉంది టీమ్.

‘F2’ తరవాత కంప్లీట్ గా రెడీ టు షూట్ మోడ్ లో ఉన్నాడు వెంకీ.  మరోవైపు ఫిబ్రవరి 20 కల్లా మ్యాగ్జిమం షూటింగ్  కి ప్యాకప్   చెప్పే ప్రాసెస్ లో  ఉంది ‘మజిలీ’ టీమ్.  అయితే ఈ సినిమా తరవాత ఏ మాత్రం గ్యాప్ లేకుండా వెంకీ తో కలిసి సెట్స్ పై ఉంటాడు చైతు.

బాబీ డైరెక్షన్ లో తెరకెక్కనుంది ‘వెంకీ మామ’. సినిమాలో చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్, వెంకీ సరసన శ్రియ శరణ్ హీరోయిన్స్ గా నటిస్తారు. కోన ఫిల్మ్  కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో పాటు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.