ముద్దుగుమ్మలతో మామఅల్లుడు

Monday,October 07,2019 - 11:43 by Z_CLU

విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోలుగా రూపొందుతున్న మ‌ల్టీస్టార‌ర్ `వెంకీమామ‌`. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకాల‌పై సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను అక్టోబ‌ర్ 8న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను ఈరోజు విడుదల చేశారు.

ఈ కల‌ర్‌ఫుల్ పోస్ట‌ర్ సినిమాపై అంచనాల్ని పెంచింది. ఓ ట్రాక్ట‌ర్‌లో వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, రాశీఖ‌న్నా ఉన్నారు. ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో వేసిన ఓ భారీ సెట్‌లో పాట చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది ఈ సినిమా. త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

 

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ)
నిర్మాత‌లు: సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌
కో ప్రొడ్యూస‌ర్‌: వివేక్ కూచిబొట్ల‌
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
కెమెరా: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి