వెంకీ మామ ఫస్ట్ లుక్

Saturday,April 06,2019 - 08:35 by Z_CLU

ఉగాది కానుకగా వెంకీ మామ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి నిన్న టైటిల్ లోగో రిలీజ్ కాగా, కొద్దిసేపటి కిందట ఫస్ట్ లుక్ విడుదల చేశారు. జాయ్ ఫుల్ మూడ్ లో వెంకీ, చైతూ కూర్చున్న స్టిల్ ఇది.

వెంకీమామకు సంబంధించి పాలకొల్లు సమీపంలో ఫస్ట్ షెడ్యూల్ నిర్వహించారు. ఆ షెడ్యూల్ లో ఓ పాట పిక్చరైజ్ చేశారు. ఆ పాటకు సంబంధించిన స్టిల్ నే ఇలా ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ తో ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి.

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాబి దర్శకుడు. పాయల్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.