హ్యాట్రిక్ సినిమా Mahesh తోనే ?

Monday,December 07,2020 - 12:59 by Z_CLU

సూపర్ స్టార్ Mahesh Babu ప్రస్తుతం SarkaruVaariPaata సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళి , త్రివిక్రమ్ లతో సినిమాలు కమిట్ అయ్యాడు మహేష్. తాజాగా యంగ్ డైరెక్టర్ Venky Kudumula కి కూడా సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.

ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయమైన త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి రెండో సినిమా ‘భీష్మ’ బ్లాక్ బస్టర్ డెలివరీ చేసాడు. ఇటివలే మహేష్ ‘భీష్మ’ సినిమా చూసి వెంకీని తనకోసం కథ రెడీ చేయమని చెప్పాడని సమాచారం. ప్రస్తుతం సూపర్ స్టార్ కోసం సూపర్ సబ్జెక్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట వెంకీ.

అన్ని అనుకున్నట్లు జరిగితే వెంకీ కుడుముల హట్రిక్ హిట్ సినిమా మహేశ్ తోనే ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతం వెంకీ రెండు పెద్ద బ్యానర్స్ కి సినిమాలు చేయాల్సి ఉంది. మహేష్ ప్రాజెక్ట్ సెట్ అయితే అందులో ఓ బ్యానర్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది.

Also Check జనవరి నుండి ‘సర్కారు వారి పాట’!