రామ్ చరణ్ తో హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్నాడా?

Tuesday,July 21,2020 - 02:12 by Z_CLU

ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకున్న దర్శకులపై స్టార్ హీరోల కన్ను పడటం సహజమే. ఇప్పుడు వెంకీ కుడుముల విషయంలో కూడా అదే జరుగుతుంది.  ‘ఛలో’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై సూపర్ హిట్ కొట్టిన వెంకీ రెండో సినిమాగా నితిన్ గా ‘భీష్మ’ తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. దీంతో ఇప్పుడు వెంకీ కుడుములకి అవకాశం ఇచ్చేందుకు డిసైడ్ అవుతున్నారు స్టార్ హీరోలు.

అందులో ముందుగా రామ్ చరణ్ ఉన్నట్లు తెలుస్తుంది. అవును.. తాజాగా ‘భీష్మ’ సినిమా చూసి వెంకీ కుడుములతో మాట్లాడి త్వరలోనే కలిసి వర్క్ చేద్దామని చరణ్ అన్నట్టు టాక్. ఇక రామ్ చరణ్ సై అనాలే కానీ ఇప్పటికిప్పుడు స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడతాడు వెంకీ. అందులో ఏ మాత్రం సందేహం లేదు.

ఒక వేళ ఈ కాంబో సెట్ అయితే మాత్రం వెంకీ కుడుముల చరణ్ సినిమాతో తన హ్యాట్రిక్ రీచ్ అవ్వడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం ‘RRR’ పూర్తయ్యాక వెయిటింగ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు చరణ్. మరి ఈ గ్యాప్ లో వెంకీ కి అవకాశం ఇస్తాడా చూడాలి.